భర్తను రూ. 15 కోట్లకు అమ్మేసిన భార్య!

Wife Sells Her Husbend for 15 Crores
  • భోపాల్ లో జరిగిన ఘటన
  • బిడ్డల కోసం భర్తను అమ్మిన యువతి
  • వైరల్ అయిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ
కొన్నేళ్ల క్రితం జగపతిబాబు, ఆమని, రోజా నటించగా, సూపర్ హిట్ గా నిలిచిన 'శుభలగ్నం' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ డబ్బుపై ఆశతో తన భర్తను కోటి రూపాయలకు మరో యువతికి విక్రయిస్తుంది. అటువంటిదే రియల్ సీన్ మధ్యప్రదేశ్ లో జరిగింది. భోపాల్ లో జరిగిన ఈ ఘటనలో తన భర్తను రూ.15 కోట్లకు ఆయన్ను ప్రేమించిన ప్రియురాలికి ఓ భార్య అమ్మేసింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో వైరల్ అయింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ బాలిక, తన తండ్రి ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని, ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశాడని, తరచూ తల్లితో గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారిద్దరి గొడవలతో తనకు, తన చెల్లెలికి చదువుపై ఆసక్తి ఉండటం లేదని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కు పిలిపించగా, అతని వివాహేతర బంధం నిజమేనని తేలింది.

అయితే, అతను ప్రియురాలితోనే ఉండాలని భావిస్తున్నట్టు చెప్పాడు. విడాకులు ఇచ్చేందుకు తొలుత అంగీకరించని భార్య, చివరకు తన బిడ్డల భవిష్యత్తు కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇల్లు, పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని కోరగా, అందుకు భర్త ప్రియురాలు అంగీకరించింది. తన భర్త ప్రవర్తన నచ్చలేదని, బిడ్డల కోసమే విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని ఆమె తెలిపింది.
Go Back to Shorts
Madhya Pradesh
Subhalagnam
Triangle Love Story

More Telugu News