మూడు రోజులుగా చచ్చిపడుతున్న కాకులు.. మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం
- ఇండోర్ కాలేజీలో 83 కాకులు మృత్యువాత
- భోపాల్ ప్రయోగశాలకు నమూనాలు
- హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్‌ప్లుయెంజా కారణమంటున్న అధికారులు
కాకుల మృతికి హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్‌ప్లుయెంజా కారణమని అధికారులు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, పక్షుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇండోర్‌లోని డాలీ కాలేజీ క్యాంపస్‌లో ఇప్పటి వరకు 83 కాకులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఇండోర్‌లోని జూపార్క్ వైద్యుడు ఉత్తమ్ యాదవ్ మాట్లాడుతూ మృతి చెందిన కాకుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్టు తెలిపారు.