Budda Venkanna: మా నాయకుడు మగాడిలా సవాల్ విసిరాడు... స్వీకరించే దమ్ము జగన్ కుందా?: బుద్ధా

  • తనపై దొంగ ఆరోపణలు చేస్తున్నారన్న లోకేశ్
  • సింహాచల అప్పన్న సన్నిధిలో ప్రమాణం చేయాలని సీఎంకు సవాల్
  • స్పందించిన బుద్ధా వెంకన్న
  • ఆరోపణలకు ఇక్కడితో చెక్ అంటూ వ్యాఖ్యలు
  • కాస్కో విజయసాయిరెడ్డీ అంటూ ట్వీట్
Budda challenges YCP top brass

తనపై వైసీపీ నేతలు దొంగ ఆరోపణలు చేస్తున్నారని, సీఎం జగన్ సింహాచలం అప్పన్న సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? అని నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. తమ నాయకుడు నారా లోకేశ్ దమ్మున్న మగాడిలా సవాల్ విసిరాడని తెలిపారు. ఈ సవాల్ స్వీకరించే దమ్ము వైఎస్ జగన్ కి ఉందా? అని ప్రశ్నించారు. లోకేశ్ పై చేస్తున్న ఆరోపణలకు ఇక్కడితో అడ్డుకట్ట పడినట్టేనని బుద్ధా అభిప్రాయపడ్డారు. 'కాస్కో విజయసాయిరెడ్డీ!' అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు బుద్ధా తమ అగ్రనేత నారా లోకేశ్ చేసిన ట్వీట్ ను కూడా పంచుకున్నారు.

More Telugu News