Chiranjeevi: అల్లు అర్జున్ ‘సామ్‌జామ్’ ప్రోమోపై మండిపడ్డ మెగాస్టార్‌ ఫ్యాన్స్... ‘ఆహా’ క్షమాపణలు

megastar fans fire on bunny
షార్ట్స్‌లో చూడండి
సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా'లో సామ్‌ జామ్‌ ప్రోగ్రామ్ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇటీవలే అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు అర్జున్‌ని సమంత ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ ఈ రోజు రాత్రి ప్రసారం అవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్‌ పేరుకి ముందు స్టైలిష్ స్టార్ అని కాకుండా 'మెగాస్టార్'‌ అని రాశారు.

దాంతో మెగాస్టార్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. చిరంజీవికి ఉండే బిరుదును దక్కించుకునే అర్హత ఏ హీరోకూ లేదని సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. బన్నీకి ఇప్పటికే స్టైలిష్‌ స్టార్‌ అన్న బిరుదు ఉందని చెబుతున్నారు. సొంత ఓటీటీ ఉంటే ఆ సంస్థ యజమాని కుమారుడికి మెగాస్టార్ బిరుదు ఇచ్చేస్తారా? అని నిలదీస్తున్నారు.

దీంతో ఈ విషయాన్ని గుర్తించిన ఆహా సిబ్బంది బన్నీ పేరుకి ముందు మెగాస్టార్‌ ట్యాగ్‌ను తీసేసి, అల్లు అర్జున్ పేరుకు ముందు స్టైలిష్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌ యాడ్‌ చేసింది. ఈ వివాదంపై 'ఆహా' స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఇది సాంకేతిక తప్పిదంగా పేర్కొంటూ తమ ట్విట్టర్ లో ప్రకటన చేసింది. ప్రేక్షకులు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని పేర్కొంది.

ఆ ప్రోగ్రాం చివరలో అనుకోకుండా ఓ పొరపాటు కారణంగానే మెగాస్టార్ అన్న పేరు వచ్చి, ఇలా జరిగిందని చెప్పింది. ప్రేక్షకులు తమపై ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగించాలని కోరింది. బాధపడ్డ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పింది. ఒకే ఒక మెగాస్టార్ ఉన్నాడని, ఈ విషయం అందరికీ తెలుసని పేర్కొంది.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Allu Arjun

More Telugu News