దుల్ఖర్, కాజల్ జంటగా 'హే సినామికా'!
- దర్శకురాలిగా కొరియోగ్రాఫర్ బృంద
- మరో నాయికగా అదితీరావు హైదరి
- తాజాగా షూటింగ్ మొత్తం పూర్తి
- తమిళ, తెలుగు, మలయాళంలో రిలీజ్
'మహానటి' ఫేమ్ దుల్ఖర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దాంతో పాటు సెట్లో తీసిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసి, వచ్చే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో ఇంకా కె.భాగ్యరాజా, సుహాసిని, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళ భాషల్లో కూడా దీనిని విడుదల చేస్తారు.