Nani: నాని ‘టక్ జగదీశ్’ క్రిస్మస్ కానుక వచ్చేసింది!

  • శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీశ్' సినిమా
  • చెప్పినట్టుగానే ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల
  • టక్ చేసుకుని భోజనానికి కూర్చొని, కత్తి పట్టుకున్న నాని
nani new movie look releases

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 26వ సినిమా 'టక్ జగదీశ్' సినిమా నుంచి క్రిస్మస్ కానుక వచ్చేసింది. ఈ సినిమాలో నాని ఫస్ట్‌లుక్‌ను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఆ సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేసింది. టక్ చేసుకుని భోజనానికి కూర్చొని.. అదే సమయంలో వెనక నుంచి కత్తి తీస్తున్నట్లు నాని లుక్ ఉంది.

ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ తో నిలిచిపోయిన షూటింగులు ప్రభుత్వ సడలింపులతో మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

More Telugu News