Alia Bhatt: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ గురించి అలియా!  
  • 'పుష్ప'లో విలన్ గా తమిళ నటుడు  
  • సెన్సార్ పూర్తిచేసుకున్న విజయ్ 'మాస్టర్'  
Alia Bhat says RRR film shoot is a new experience to her

*  ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో పాల్గొన్న బాలీవుడ్ నటి అలియా భట్ తన షూటింగ్ అనుభవాన్ని పంచుకుంది. ఈ సినిమా షూటింగు తనకు ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతినీ ఇచ్చిందని చెప్పింది. 'నాకు తెలుగు రాదు. అందుకే, ముందుగానే ఆ సినిమా డైలాగులని తెప్పించుకుని, బట్టీపట్టేశాను. దాంతో అవి నాకు కంఠతా వచ్చేశాయి. ఇక షూటింగులో కంగారుపడకుండా నటించేశాను' అని చెప్పింది అలియా.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర ఎవరు పోషిస్తారన్న విషయమై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తమిళ నటుడు ఆర్య ఈ పాత్రకు ఎంపిక అయినట్టు తాజా సమాచారం.
*  తమిళ హీరో విజయ్ కథానాయకుడుగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'మాస్టర్' సెన్సార్ పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని జనవరి 13న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇందులో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది.

More Telugu News