బోయపాటి సినిమా సెట్స్ పై బాలకృష్ణను కలిసిన తెలంగాణ తెలుగు యువత ప్రతినిధులు

బోయపాటి సినిమా సెట్స్ పై బాలకృష్ణను కలిసిన తెలంగాణ తెలుగు యువత ప్రతినిధులు

 Telangana Telugu Yuvatha met Balakrishna on the sets of Boyapati movie
  • బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ
  • హైదరాబాదులో తాజా షెడ్యూల్
  • సెట్స్ వద్దకు వెళ్లిన తెలంగాణ తెలుగు యువత ప్రతినిధులు
  • కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
  • బాలయ్య చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో సింహా, లెజెండ్ హిట్ కావడంతో ఇప్పుడొస్తున్న మూడో చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్స్ పై ఉన్న హీరో బాలకృష్ణను తెలంగాణ తెలుగు యువత ప్రతినిధులు కలిశారు.

ఈ నెల 24న జరగనున్న తెలంగాణ తెలుగు యువత కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వారు బాలయ్యను ఆహ్వానించారు. ఈ మేరకు తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పొగాకు రామ్ చందర్ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా బాలయ్య చేతులమీదుగా తెలంగాణ తెలుగు యువత లోగోను ఆవిష్కరించారు.
Balakrishna
Telangana Telugu Yuvatha
Invitation
Boyapati Sreenu
Movie
Telangana

More Telugu News