ఆనందంతో నవ్వులు చిందిస్తున్న రేణూ దేశాయ్ వీడియో.. త్వరలో ఓ విషయం చెబుతానని పోస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆనందంతో నవ్వులు చిందిస్తున్న రేణూ దేశాయ్ వీడియో.. త్వరలో ఓ విషయం చెబుతానని పోస్ట్!

renu desai video goes viral
  • ఆమె పక్కనే కూతురు ఆద్య డ్యాన్స్ 
  • ‘నేను ఇలా ఎందుకు న‌వ్వుతున్నానో తెలుసుకోవాలంటే వేచి చూడండి’ అని వ్యాఖ్య
  • ఓ లవ్ సాంగ్‌నూ వినిపించిన రేణూ
సినీ నటి రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్టు చేసింది. సిగ్గుపడుతూ, నవ్వుతూ ఓ వీడియో తీసుకుని దాన్ని పోస్ట్ చేసి, ఆ నవ్వుకు కారణం ఏంటో త్వరలోనే చెబుతానని సస్పెన్స్ లో పెట్టింది. ఇందులో ఆమె పక్కనే కూతురు ఆద్య డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు.

‘నేను ఇలా ఎందుకు న‌వ్వుతున్నానో తెలుసుకోవాలంటే వేచి చూడండి’ అని ఆమె పేర్కొంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఓ సినిమాలోని ఓ పాటను ఆమె ఈ సందర్భంగా వినిపించింది.

‘ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె పిల్లిమొగ్గలేసిందిలా.. గాలుల్లో నీ వాసన...’ అనే పాటను ఈ వీడియోలో వినొచ్చు. దీంతో ఆమె చెప్పబోయే విషయం ఏంటనే విషయంపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  
Renu Desai
Viral Videos
Tollywood

More Telugu News