సౌదీ అప్పు తీర్చడానికి చైనా ముందు చేయి చాచిన పాకిస్థాన్
Add ap7am to your home Screen

సౌదీ అప్పు తీర్చడానికి చైనా ముందు చేయి చాచిన పాకిస్థాన్

China to help Pakistan to repay debts
  • 2 బిలియన్ డాలర్ల మేర సౌదీ నుంచి అప్పు తీసుకున్న పాక్
  • పెరిగిపోతున్న రుణభారం
  • 1.5 బిలియన్ డాలర్లు సాయం చేయాలని చైనా నిర్ణయం
  • 2011 నాటి ఒప్పందం పొడిగింపు ద్వారా చైనా సాయం
  • సోమవారం ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలని భావిస్తున్న పాక్
పాకిస్థాన్ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందో చెప్పే పరిణామం చోటుచేసుకుంది. సౌదీ అరేబియా నుంచి తీసుకున్న 2 బిలియన్ డాలర్ల అప్పును తీర్చేందుకు పాకిస్థాన్ ఇప్పుడు చైనా సాయం కోరింది. ఒక అప్పు తీర్చేందుకు పాక్ మరో అప్పు చేస్తోంది. ఇప్పటికే పాక్ ను రుణభారం నుంచి తప్పించడానికి అనేక చర్యలు ప్రకటించిన చైనా తాజాగా మరోసారి రుణం అందించనుంది.

పాక్ ను ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు 1.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. చైనా ఆర్థికసాయం నేపథ్యంలో సోమవారం సౌదీ సర్కారుకు ఒక బిలియన్ డాలర్ల అప్పు తీర్చాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మిగతా ఒక బిలియన్ డాలర్లను జనవరిలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు ట్రిబ్యూన్ మీడియా సంస్థతో సన్నిహితవర్గాలు వివరాలు పంచుకున్నాయి.

అయితే, ఈ రుణాన్ని చైనా నేరుగా ఇవ్వబోవడంలేదు. 2011లో పాక్ తో కుదుర్చుకున్న కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ను పొడిగించడం ద్వారా ఈ రుణం అందిస్తోంది.
Pakistan
China
Debts
Saudi Arabia

More Telugu News