Alia Bhatt: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఆస్కార్ విజేత సినిమాలో అలియా భట్ 
  • బాలకృష్ణకు కథ చెప్పనున్న పూరి
  • ఎన్టీఆర్ సినిమాకు మరో కొత్త టైటిల్  
Alia Bhat signs new film

*  ప్రస్తుతం తెలుగులో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ అలియా భట్ హిందీలో మరో చిత్రాన్ని అంగీకరించింది. ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకట్టి దర్శకత్వం వహించే సినిమాలో అలియా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'పిహర్వా' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు.
*  ఆమధ్య బాలకృష్ణతో 'పైసా వసూల్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలయ్య ఇమేజ్ కు తగ్గా ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును పూరి తయారుచేశాడనీ, త్వరలోనే కలసి కథ చెప్పనున్నాడనీ తెలుస్తోంది.
*  ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. మొదట్లో ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే పేరును వర్కింగ్ టైటిల్ గా అనుకున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం 'రాజా వచ్చినాడు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

More Telugu News