Tamannaah: రాఘవేంద్రరావు నటించే సినిమాలో తమన్నా?

  • భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు 
  • భార్య పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ 
  • మరో ముగ్గురు కథానాయికలు కూడా
  • సమంత స్థానంలో తమన్నా ఎంపిక  
Thamanna to play heroine in Raghavendra Raos movie

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కథానాయకుడుగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

కాగా, ఇందులో రాఘవేంద్రరావు విశ్రాంత ఉద్యోగిగా నటిస్తుండగా.. ఆయన భార్యగా ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో మరో ముగ్గురు కథానాయికలు కూడా నటిస్తారు. ఈ పాత్రలకు శ్రియ, సమంతలను సంప్రదిస్తున్నారనీ, మరో కథానాయికగా కొత్త అమ్మాయిని పరిచయం చేస్తారనీ ఇటీవల వార్తలొచ్చాయి.

అయితే, తాజా సమాచారం ప్రకారం, సమంత ఇందులో నటించడం లేదట. ఆ పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నారని తెలుస్తోంది. తాజాగా తమన్నాను దర్శకుడు భరణి కలసి, కథ చెప్పారనీ, చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతారు.

More Telugu News