Corona Virus: దేశంలో కొత్తగా 32,080 మందికి కరోనా

 Indias total cases rise to 9735850
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 32,080 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,35,850కి చేరింది. ఇక గత 24 గంటల్లో 36,635 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 402 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,41,360కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,15,581 మంది కోలుకున్నారు. 3,78,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,98,36,767  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,22,712 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News