సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం: ఎస్ఈసీ అప్పీలుపై హైకోర్టు
- సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీలు చేసిన ఎస్ఈసీ
- సోమవారం సింగిల్ జడ్జి విచారణ ఉందన్న కోర్టు
- ఆ తర్వాత అభ్యంతరాలుంటే అప్పీల్ చేయాలని సూచన
సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల నేరేడ్ మెట్ డివిజన్ లో ఫలితం నిలిచిపోయిందని కోర్టుకు ఎస్ఈసీ తెలిపింది. అయితే, సింగిల్ జడ్జి బెంచ్ వద్ద సోమవారం ఈ అంశంపై విచారణ ఉన్నందున అత్యవసరంగా తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. సింగిల్ జడ్జి విచారణ పూర్తయ్యాక అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేయాలని సూచించింది. సోమవారం ఉదయం ఇదే అంశంపై తొలుత విచారణ జరపాలని సింగిల్ జడ్జ్ కు సూచించింది.