తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు

596 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,72,719
  • కోలుకున్న వారు 2,62,751 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,470
  • 8,498 యాక్టివ్ కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 802 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,72,719కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,62,751 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,470కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,498 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,465 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.  
  
Corona Virus
COVID19
Telangana

More Telugu News