గ్రేటర్ ఎన్నికల ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ 23, టీఆర్ఎస్ 6 చోట్ల ఆధిక్యం
- 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు
- తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- డివిజన్ల వారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాల ప్రకటన
- 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు
కాగా, ఈ నెల 1న 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 34,50,331 ఓట్లు పోలయ్యాయి. 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు జారీ చేశారు. మొదటి రౌండ్‌గా వీటిని తెరిచారు. డివిజన్ల వారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలను ప్రకటిస్తున్నారు.