కారు బానె‌ట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్.. అర కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో ఇదిగో

కారు బానె‌ట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్.. అర కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో ఇదిగో

 An onduty Traffic Police personnel was dragged on the bonnet of a car
  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన 
  • రోడ్డుపై విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ పోలీసు
  • ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనదారుల్నీ ఢీ
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సక్కార్దర ప్రాంతంలో రోడ్డుపై విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి చెక్ చేసి, సరైన పత్రాలు లేకపోతే జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో  సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్‌ పోలీసు  ఓ కారును ఆపగా, డ్రైవర్‌ ఆగ్రహంతో ఊగిపోతూ కారును ఆపకుండా ముందుకు తీసుకుపోయాడు.

దీంతో ఆ కానిస్టేబుల్ కారు ముందే నిలబడి ఉండడంతో బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా దాదాపు అర కిలోమీటరు ముందుకు తీసుకెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆ కారు డ్రైవర్ ఢీ కొట్టాడు.  

చివరకు ఓ కాలేజీ వద్ద ఆ కారును ఆపగా, కానిస్టేబుల్ దానిపై నుంచి దిగాడు. అక్కడ స్థానికులు ఆ కారు నడిపిన వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
car
Traffic Police
Maharashtra

More Telugu News