భారత్‌తో రెండో వన్డేలో 300 దాటిన ఆస్ట్రేలియా స్కోరు

australia score 314  44 overs
  • ఏజే ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు 
  • డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83
  • సెంచరీ బాదిన స్మిత్
  • ఆస్ట్రేలియా స్కోరు 44 ఓవర్ల వద్ద 314/3
ఆస్ట్రేలియా-భారత్ మధ్య సిడ్నీలో జరుగుతోన్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆసీస్ జట్టు స్కోరు 300 దాటింది. ఏజే ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.

మూడో ఆర్డర్ లో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 2 సిక్సులు, 14 ఫోర్లతో సెంచరీ బాదాడు. 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాబుస్చాగ్నే 51, మ్యాక్స్ వెల్ 10 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 44 ఓవర్ల వద్ద 314/3గా ఉంది. భారత బౌలర్లలో షమీ, పాండ్యాలకు ఒక్కో వికెటు దక్కాయి.
Go Back to Shorts
Australia
India
Cricket
Team India

More Telugu News