Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • 24 గంటల్లో 993 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042
  • 2,53,715 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,441
new 993 COVID19 infections in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 993 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,150 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,53,715 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,441కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,594 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి.
       
 

More Telugu News