"యోవ్... పుష్పరాజ్ ఒచ్చేసినాడు"... అంటూ ఆసక్తికర ఫొటో పంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్
- పుష్ప షూటింగ్ మళ్లీ మొదలు
- సెట్స్ పైకి బన్నీ ఆగమనం
- మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్
సెట్స్ పై బన్నీ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పంచుకుంది. "యోవ్... పుష్పరాజ్ ఒచ్చేసినాడు... ఇక చూస్కోండి!" అంటూ చిత్తూరు జిల్లా యాసలో ట్వీట్ చేసింది. పుష్ప చిత్రంలో బన్నీ చిత్తూరు జిల్లా లారీడ్రైవర్ గా పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ పక్కన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.