Nani: తన చిరకాల కోరికను నెరవేర్చుకోబోతున్న నాని!

  • మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసిన నాని 
  • 'టక్ జగదీశ్' తర్వాత 'శ్యామ్ సింగ రాయ్'
  • ఇందులో సినిమా డైరెక్టర్ పాత్ర పోషణ
  • కథానాయికలుగా సాయిపల్లవి, కృతి శెట్టి  
Nani to playa movie director in his next

ఏ పాత్ర పోషించినా అందులో సహజంగా కనిపిస్తూ తనదైన ముద్ర వేసే హీరోగా నానికి పేరుంది. అందుకే నేచురల్ స్టార్ గా కూడా పేరుతెచ్చుకున్నాడు. మొదట్లో దర్శకుడు అవుదామని వచ్చి, దర్శకత్వ శాఖలో పనిచేసిన నాని, ఆ తర్వాత అనుకోకుండా హీరో అయిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే, దర్శకుడు అవ్వాలన్న తన చిరకాల కోరికను ఇప్పుడు నాని మరోలా తీర్చుకుంటున్నాడు.

ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమాలో నటిస్తున్న నాని, దీని తర్వాత 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. దీనికి 'శ్యామ్ సింగ రాయ్' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ఇందులో నాని సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాడట. అందుకు సంబంధించిన సీన్లు గమ్మత్తుగా.. సరదాగా వుంటాయని అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తారు. వీరి ఎంపిక ఇప్పటికే పూర్తయింది. కాగా, ఈ చిత్రం కథ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. అందుకే మొదట్లో కోల్ కతా వెళ్లి షూటింగ్ చేయాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అందుకు బదులుగా కోల్ కతా వీధులు.. ఆ నగర సంస్కృతి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ వేసి, హైదరాబాదులోనే షూటింగును నిర్వహిస్తారట!

More Telugu News