గ్రేట్ ఇండియన్ బ్యాట్స్ మెన్: కోహ్లీపై యువరాజ్ ప్రశంసల జల్లు
- నేడు 32వ జన్మదినాన్ని జరుపుకుంటున్న కోహ్లీ
- ఎప్పుడూ సంతోషంగా ఉండు అంటూ యువీ గ్రీటింగ్స్
- ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే ఉండాలని ఆకాంక్ష
ప్రస్తుతం ఐపీఎల్ కోసం విరాట్ కోహ్లీ యూఏఈలో ఉన్నాడు. కోహ్లీ నేతృత్వం వహిస్తున్న ఆర్సీబీ జట్టు లీగ్ దశను దాటుకుని... ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఈ టోర్నీ ప్రారంభంలో తక్కువ స్కోర్లు చేస్తూ ఆర్సీబీ వెనుకబడిపోయింది. అయితే, కోహ్లీ ఒక్క సారిగా పుంజుకోవడంతో లీగ్ దశను నాలుగో స్థానంతో ముగించింది. లీగ్ దశలో 14 మ్యాచుల్లో కోహ్లీ 460 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.