Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాలో మరో హీరో ఎవరో?

Who is the another hero in Pawan Kalyans film
షార్ట్స్‌లో చూడండి
ఆమధ్య రాజకీయాలలో బిజీ అయి, కొన్నాళ్లు సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల మళ్లీ సినిమాలలో నటిస్తున్న సంగతి విదితమే. పైగా ఇప్పుడు వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అంగీకరించిన చిత్రమే 'అయ్యప్పనుమ్ కోషియమ్'. మలయాళంలో హిట్టయిన ఈ చిత్రకథ నచ్చడంతో పవన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇందులో పవన్ పాత్ర కాకుండా మరో హీరో పాత్ర కూడా వుంది. కీలకమైన ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ రానా దగ్గుబాటి ఈ పాత్రను పోషిస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా మరికొన్ని పేర్లు ఆ జాబితాలో చేరుతున్నాయి.

నితిన్ నటిస్తాడని ఒకసారి.. కాదు కన్నడ నటుడు సుదీప్ నటిస్తాడని మరోసారి కూడా వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇదిలావుంచితే, ఇందులో పవన్ సరసన కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇది కూడా అధికారికంగా ఖరారు కావలసి వుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించే ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను పోషించనున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Vijay Setupati
Rana Daggubati
Sudeep

More Telugu News