Allu Arjun: వెరీ స్వీట్ లవ్ స్టోరీ... 'కలర్ ఫొటో' చిత్రబృందాన్ని అభినందించిన అల్లు అర్జున్

  • ఇటీవలే ఓటీటీ వేదికపై రిలీజైన కలర్ ఫొటో చిత్రం
  • హిట్ టాక్ సొంతం చేసుకున్న చిన్న సినిమా
  • చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా చూశానన్న బన్నీ
Allu Arjun appreciates Colour Photo unit members for their success

ఇటీవలే ఆహా ఓటీటీ వేదికపై విడుదలైన చిత్రం 'కలర్ ఫొటో'.  ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ నేచురల్ లవ్ స్టోరీలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అంతేకాదు, విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ 'కలర్ ఫొటో' చిత్రబృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

ఇవాళ బన్నీని 'కలర్ ఫొటో' చిత్రబృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన వారిని మెచ్చుకున్నారు. "వెరీ స్వీట్ లవ్ స్టోరీ" అంటూ కొనియాడారు. అద్భుతమైన సంగీతంతో కూడిన ఈ చిత్రం మనసుకు హత్తుకుపోయింది అని పేర్కొన్నారు. నటీనటుల భావోద్వేగాలు, వారి నటన ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి కలిగిందని బన్నీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

More Telugu News