Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • గత 24 గంటల్లో కొత్తగా 1,421 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001
  • 2,07,326 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,298      
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,421 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,221 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,07,326 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,298 కి చేరింది. ప్రస్తుతం 20,377 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,214 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 97 కేసులు నిర్ధారణ అయ్యాయి.
      

More Telugu News