Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

  • గత 24 గంటల్లో కొత్తగా 1,579 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,124
  • మృతుల సంఖ్య మొత్తం 1,287
  • యాక్టివ్ కేసులు 20,449
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,579 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,811  మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,124 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,04,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,287 కి చేరింది. ప్రస్తుతం 20,449 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,071 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 102 కేసులు నిర్ధారణ అయ్యాయి.
         
      

More Telugu News