మధ్యప్రదేశ్ మహిళా మంత్రిని ఐటమ్ గా అభివర్ణించిన కమల్ నాథ్... బీజేపీ ఆగ్రహం
- దబ్రా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు
- బీజేపీ తరఫున బరిలో ఉన్న కేబినెట్ మంత్రి ఇమార్తి దేవి
- తాను ఆమె పేరును కూడా పలకనని చెప్పిన కమల్
ఎన్నికల సభలో మాట్లాడుతూ "మన అభ్యర్థి ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెతో పోల్చితే మన అభ్యర్థి ఎంతో మేలు. ఇంతకీ ఆమె పేరేంటి...? అయినా నేను ఆమె పేరు ఎందుకు పలకాలి? ఏం ఐటమ్ అబ్బా... ఏం ఐటమ్!" అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై సీరియస్ అయిన బీజేపీ వర్గాలు కమల్ నాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఓ దళిత అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కమల్ నాథ్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.