'రాధే శ్యామ్' నుంచి పూజ హెగ్డే స్టిల్ విడుదల.. చిరునవ్వులు చిందిస్తోన్న బుట్ట బొమ్మ!

13-10-2020 Tue 10:37
introducing Poojahegde as Prerana from RadheShyam
  • పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా విడుదల
  • పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా సినిమా
  • 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్

సాహో సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్‌ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోంచి పూజ హెగ్డే స్టిల్ ను విడుదల చేశారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న పూజ హెగ్డే ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సందర్భంగా ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనపడుతోన్న తీరు అలరిస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే పేరు ప్రేరణ అని ఈ సినియా యూనిట్ తెలిపింది. ఈ సినిమా పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ సినిమాలో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా, పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.