సిద్ధు, శ్రద్ధ జంటగా 'నరుడి బ్రతుకు నటన'
- సితార ఎంటర్ టైన్మెంట్స్ నుంచి పదవ చిత్రం
- సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లు
- నూతన దర్శకుడు విమల్ కృష్ణ పరిచయం
- దీపావళి నుంచి షూటింగుకి సన్నాహాలు
ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఈ రోజు సంస్థ విడుదల చేసింది. తన్మయత్వంలో వున్న ఓ ప్రేమజంట చెవులకు హెడ్ ఫోన్స్ తో ఈ ప్రచార చిత్రాన్ని కొత్తగా డిజైన్ చేశారు. దీనిని బట్టి సంగీతానికి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న పదవ చిత్రం ఇది.