సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Sai Pallavi signs for two films
  • మరో రెండు సినిమాలకు సాయిపల్లవి సంతకం 
  • సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రికార్డు 
  • ఓటీటీ ద్వారా విడుదల కానున్న 'ఉప్పెన' 
*  ప్రస్తుతం 'లవ్ స్టోరీ', 'విరాటపర్వం' చిత్రాలలో కథానాయికగా నటిస్తున్న హోమ్లీ హీరోయిన్ సాయిపల్లవి తాజాగా మరో రెండు చిత్రాలను అంగీకరించింది. వీటిలో నాని సరసన నటించే చిత్రం ఒకటి కాగా, శర్వానంద్ పక్కన నటించే చిత్రం మరొకటి. వీటి వివరాలు తెలియాల్సివుంది.
*  స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి వున్న దక్షిణాది స్టార్ గా రికార్డు సాధించాడు. ఫేస్ బుక్ లో 18 మిలియన్, ఇన్ స్టాగ్రామ్ లో 8.8 మిలియన్, ట్విట్టర్లో 5.2 మిలియన్ల ఫాలోవర్స్ తో బన్నీ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
*  'ఉప్పెన' చిత్రం ద్వారా చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Sai Pallavi
Nani
Sharwanand
Allu Arjun

More Telugu News