బోయపాటి సినిమాలో సీనియర్ హీరోయిన్!
- బాలకృష్ణ, బోయపాటిల మూడో చిత్రం
- రెండు పాత్రలు పోషిస్తున్న బాలయ్య
- సీనియర్ బాలకృష్ణ పాత్ర సరసన స్నేహ?
ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సీనియర్ బాలకృష్ణ పాత్ర సరసన మీనా జోడీగా నటిస్తుందని ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు కొత్తగా స్నేహ పేరు తెరపైకి వచ్చింది. హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న స్నేహ అయితే, ఆ పాత్రకు బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో బోయపాటి ఆమె వైపు మొగ్గు చూపుతున్నాడట. దీంతో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
లాక్ డౌన్ కి ముందుగా కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ త్వరలో హైదరాబాదులో ప్రారంభం కానుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ నిర్వహిస్తారని అంటున్నారు.