Bunny: 'అల్లు స్టూడియోస్' ప్రారంభించిన బన్నీ కుటుంబ సభ్యులు

  • ఇవాళ అల్లు రామలింగయ్య జయంతి
  • నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
  • సినిమా, టీవీ షూటింగులకు ఉపయోగపడేలా భారీ స్టూడియో నిర్మాణం
Bunny family members has inaugurated Allu Studios

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అల్లు రామలింగయ్య జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.  సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.

ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

More Telugu News