తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

2214 corona cases in telangana
  • కొత్తగా 2,214 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,600
  • 1,63,407 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,135  
తెలంగాణ‌లో కరోనా కేసుల తాజా వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,214 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,474 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,600 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,63,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,135 కు చేరింది. ప్రస్తుతం 29,058 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 305, రంగారెడ్డి జిల్లాలో 191 కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..  
       
      
Corona Virus
COVID-19
Telangana

More Telugu News