తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు

2072 corona cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283
  • 1,58,690 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,116
  • 29,477 యాక్టివ్ కేసులు
తెలంగాణ‌లో కరోనా కేసుల తాజా వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. దీని ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,072 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,259 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,58,690 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,116కు చేరింది. ప్రస్తుతం 29,477 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 283, రంగారెడ్డి జిల్లాలో 161 కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
 
             
Corona Virus
COVID-19
Telangana

More Telugu News