తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

1378 new cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 1,378 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,211
  • 1,56,431 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,107
తెలంగాణ‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,378 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,932 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,56,431 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,107కు చేరింది. ప్రస్తుతం 29,673 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 254, రంగారెడ్డి జిల్లాలో 110 కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
    
 
Corona Virus
COVID-19
Telangana

More Telugu News