Corona Virus: తెలంగాణలో మరో 2,296 మందికి కరోనా నిర్ధారణ

spike of 2296 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,296 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,062 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,77,070కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,46,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,062కు చేరింది. ప్రస్తుతం 29,873 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 321, రంగారెడ్డి జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి.
        
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News