తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్

2166 new cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 2,166 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774
  • 1,44,073 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,052
తెలంగాణ‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,166 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,143 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,44,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,052కు చేరింది. ప్రస్తుతం 29,649 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 309, రంగారెడ్డి జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి.
          
Corona Virus
COVID-19
Telangana

More Telugu News