Corona Virus: తెలంగాణలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్‌

1302 new corona cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభణ కొన‌సాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,302 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,230 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,41,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,042కు చేరింది. ప్రస్తుతం 29,636 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 266, రంగారెడ్డి జిల్లాలో 98 కేసులు నమోదయ్యాయి.
 
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News