తెలంగాణలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్‌

19-09-2020 Sat 09:29
2123 new corona cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 2,123 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,169
  • 1,37,508 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,025

తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభణ కొన‌సాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,123 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా,  2,151 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,169 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,37,508 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,025కు చేరింది. ప్రస్తుతం 30,636 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 305 కేసులు నమోదయ్యాయి.