Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య!

New Corona cases in TS decreased
షార్ట్స్‌లో చూడండి
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,417 కేసులు నమోదయ్యాయి. అయితే, గత కొన్ని రోజులుగా నమోదైన కేసులతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే తీరు కొనసాగితే... రాష్ట్రంలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టినట్టుగా భావించొచ్చు.

మరోవైపు తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కి చేరుకుంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 974కి పెరిగింది. గత 24 గంటల్లో 13 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు (264) జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి జిల్లా 133, కరీంనగర్ జిల్లా 108 ఉన్నాయి.
Go Back to Shorts
Telangana
Corona Virus
Updates

More Telugu News