కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్
- అవినీతి అంతం కోసమే నూతన చట్టం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
- పేదల బాధలకు ఇది ముగింపు పలుకుతుందని వెల్లడి
- గత పాలకులు పరిష్కారం చూపలేకపోయారన్న సీఎం
భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించినప్పటి నుంచి భూమికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని, గత పాలకులు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నవ్య సంస్కరణలతో కూడిన చట్టాన్ని రూపొందించామని వివరించారు.