సుశాంత్ మరణం వెనుకున్న మాస్టర్ మైండ్స్ పేర్లను రియా బయటపెట్టాలి: కంగన
- రియాను బలిపశువును చేస్తారనే విషయాన్ని ముందు నుంచి చెపుతున్నా
- విచారణలో అన్ని విషయాలను రియా బయట పెట్టాలి
- మాస్టర్ మైండ్ల పేర్లను వెల్లడించాలి
ఆమె డబ్బు కోసం మగాళ్లతో స్నేహం చేసే మహిళే కావచ్చు... ఆమె డ్రగ్స్ తీసుకునే ఉండొచ్చు... కానీ, విచారణలో అన్ని విషయాలను నిర్భయంగా బయటపెట్టాలని వ్యాఖ్యానించింది. సుశాంత్ మరణం వెనుకున్న మాస్టర్ మైండ్స్ పేర్లను ఆమె వెల్లడించాలని కంగన చెప్పింది. సుశాంత్ సినిమాలను లాక్కున్న వ్యక్తులు ఎవరు? అతనికి డ్రగ్స్ ఇచ్చింది ఎవరు? అతని కెరీర్ ను నాశనం చేయాలని అనుకున్నది ఎవరు? అనే విషయాలను రియా బయటపెట్టాలని తెలిపింది.