Corona Virus: తెలంగాణ‌లో కొత్త‌గా 2,392 క‌రోనా కేసులు

new 2392 corona cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,392 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా,  2,346 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,12,587మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం  906కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 304 కరోనా కేసులు నమోదయ్యాయి.      
           
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News