ఉద్ధవ్ థాకరే తర్వాత.. శరద్ పవార్ కు బెదిరింపు కాల్స్!

Sharad Pawar gets threat call
  • నిన్న రాత్రి థాకరే నివాసానికి దుబాయ్ నుంచి కాల్
  • ఈరోజు పవార్, అనిల్ దేశ్ ముఖ్ లకు కాల్స్
  • విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన ఘటన కలకలం రేపింది. ఇది గడిచి 24 గంటలు కూడా గడవక ముందే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ లకు కూడా బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ రెండు కాల్స్ కూడా వారి నివాసాలకు వచ్చాయి. ఈ కాల్స్ విదేశాల నుంచి వచ్చాయి. దీనికి సంబంధించి విచారణ ప్రారంభమైంది.

దావూద్ అనుచరుడి పేరిట థాకరేకు దుబాయ్ నుంచి నిన్న రాత్రి 10.30 గంటలకు కాల్ వచ్చింది. సీఎంతో దావూద్ మాట్లాడాలనుకుంటున్నారని ఫోన్ లోని వ్యక్తి చెప్పాడని... అయితే టెలిఫోన్ ఆపరేటర్ ఆ కాల్ ను సీఎంకు ట్రాన్స్ ఫర్ చేయలేదని అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ రాజకీయ ప్రముఖులకు ఇలాంటి కాల్స్ రావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Go Back to Shorts
Sharad Pawar
NCP
Threat Call
Maharashtra

More Telugu News