kangana: సంజ‌య్ రౌత్ పై మ‌రోసారి హీరోయిన్ కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు

  • సంజయ్ రౌత్‌ పురుష అహంకారి  
  • ముంబైలో బతకలేకపోతున్నామని ఆమిర్‌ ఖాన్ కూడా అన్నారు
  • వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
  • నేను మహిళను అయినందునే సంజ‌య్ రౌత్ రెచ్చిపోతున్నారు
kangana slams sanjay

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి నేప‌థ్యంలో నెపోటిజంతో పాటు ముంబై పోలీసుల తీరును విమ‌ర్శిస్తూ హీరోయిన్ కంగనా ర‌నౌత్  తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో  కొన్ని రోజులుగా శివ‌సేన నేత‌ సంజ‌య్ రౌత్, కంగ‌నా మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవ‌లే ఆమె ముంబైని పీవోకేతో పోల్చింది.

సంజ‌య్ రౌత్ పై కంగ‌నా మ‌రోసారి తీవ్రస్థాయిలో మండిప‌డింది.  సంజయ్ రౌత్‌ పురుష అహంకారి అని ఆమె విమర్శించింది. భారతీయ మహిళలపై అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమే కార‌ణ‌మ‌ని ఆమె వ్యాఖ్యానించింది. గతంలో ముంబైలో బతకలేకపోతున్నామని ఆమిర్‌ ఖాన్‌, నసీరుద్దీన్ షా అన్నార‌ని, మ‌రి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా నిలదీసింది.

తాను ఒక మహిళను అయినందునే సంజ‌య్ రౌత్ రెచ్చిపోయి మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెప్టెంబర్ 9న తాను ముంబై వస్తున్నానని ఆమె మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. దమ్ముంటే తనను అడ్డుకోవాలని సవాలు విసిరింది. కాగా, కంగ‌నా ర‌నౌత్ కు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వై కేటగిరీ భద్రత కల్పించింది.

More Telugu News