Corona Virus: తెలంగాణలో మ‌రో 2,574 కరోనా కేసులు

new 2574 corona cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,574 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,927 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,969కి చేరింది.  ఇప్పటివరకు మొత్తం 1,07,530  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 886 కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 325 కరోనా కేసులు నమోదయ్యాయి.  

      


    
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News