బాలకృష్ణ సినిమాలో నిన్నటితరం హీరోయిన్
- బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తాజా సినిమా
- త్వరలో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్
- సీనియర్ బాలకృష్ణ పాత్ర సరసన మీనా
- బాలయ్య, మీనా జంటపై ఫ్యామిలీ సాంగ్
కాగా, ఈ చిత్రంలో నిన్నటితరం ప్రముఖ కథానాయిక మీనా కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో సీనియర్ బాలకృష్ణ పాత్రధారి సరసన మీనా భార్యగా నటిస్తుందని అంటున్నారు. వీరిద్దరిపైనా ఒక ఫ్యామిలీ సాంగును కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటను త్వరలో చిత్రీకరిస్తారని సమాచారం. ఈ పాత్రలో బాలయ్య పంచెకట్టులో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక బోయపాటి మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ బాలకృష్ణ పక్కన ఓ కొత్త అమ్మాయిని కథానాయికగా పరిచయం చేయనున్నారు.