టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పీపీఈ కిట్ ధరించి హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. కరోనా నేపథ్యంలో ఫేస్ మాస్కుతో పాటు, గ్లవ్స్ ను ఆయన ధరించారు. విమానాశ్రయంలోకి ఆయన వెళ్తుండగా సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో సినీ ప్రముఖులు ప్రయాణాలు చేస్తున్నారు.