ఈసారి ఐపీఎల్ కు రాలేనన్న మలింగ... ఆసీస్ పేసర్ ను పిలిపించిన ముంబయి ఇండియన్స్
- కుటుంబంతో ఉండాలని మలింగ నిర్ణయం
- మలింగ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్న ఆకాశ్ అంబానీ
- మలింగ స్థానంలో ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ కు అవకాశం
దీనిపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, శ్రీలంకలోని తన కుటుంబంతోనే ఉండాలని మలింగ నిర్ణయించుకున్నాడని, అతడి అభిప్రాయాలకు విలువ ఇస్తామని తెలిపారు. ముంబయి ఇండియన్స్ ఓ జట్టు మాత్రమే కాదని, విలువలున్న ఓ కుటుంబం అని వివరించారు. మా ఇంటి సభ్యుడి వంటి మలింగకు కచ్చితంగా మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. మలింగ స్థానంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ ను తీసుకుంటున్నామని, ప్యాటిన్సన్ ముంబయి జట్టు అవసరాలకు తగినవాడని భావిస్తున్నామని వివరించారు.