తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు... టీఎస్ కు కీలక ప్రతిపాదన చేసిన ఏపీ!
- 1.12 లక్షల కిలోమీటర్లు తగ్గించుకోవాలన్న టీఎస్
- 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామన్న ఏపీ
- ఆ మేరకు టీఎస్ సర్వీసులు పెంచుకోవచ్చని సూచన
ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ వచ్చింది. తాము 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని ఈ లేఖలో ప్రతిపాదించారు. దీనిపై వెంటనే చర్చించి, బస్సులను నడిపిద్దామని ఈ లేఖలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారు. దీనిపై ఇంకా టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించలేదు.